ఈ ఏడాది జనవరి 2న గుండెపోటుతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఈరోజు మరోసారి గుండెపోటు వచ్చింది.
దీంతో అతడిని కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 25 రోజుల క్రితం కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో ఆయనకు జరిగిన గుండె చికిత్సలో మూడు బ్లాకులను డాక్టర్లు పూడ్చిన విషయం తెలిసిందే.
బెంగాల్‌లోని పత్రికల కథనాల ప్రకారం ఆసుపత్రికి తన సొంతకారులోనే డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని వచ్చిన గంగూలీని వెంటనే అపోలో లోని ఐసియు వార్డ్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
చివరిసారి జరిగిన ఆపరేషన్ అనంతరం రెండు వారాలకు మరోసారి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు గంగూలీకి అప్పట్లోనే సూచించినట్లు తెలుస్తోంది.