క్రికెటర్ల ‘ఓర్పు’కు పరీక్ష

కొత్త ఫిట్​నెస్​ రూల్స్​ ప్రకటించిన బిసిసిఐ

By udayam on January 23rd / 7:39 am IST

అంతర్జాతీయ క్రికెట్​లో పెరుగుతున్న ఫిజికల్​ ఫిట్​నెస్​ గోల్స్​కు అనుగుణంగా భారత క్రికెటర్లకు కొత్త ఫిట్​నెస్​ లక్ష్యాలను బిసిసిఐ నిర్ధేశించింది.

ఈ మేరకు 2 కిలోమీటర్ల టైమ్​ ట్రయల్స్​ను నిర్వహించి క్రికెటర్ల వేగం, వారి అలసట, ఓర్పు లను గమనించనుంది బిసిసిఐ. ఈ కొత్త టైమ్​ ట్రయల్స్​ బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్ళందరికీ తప్పనిసరి అని పేర్కొంది.

ఈ ఫిట్​నెస్​ పరీక్షతో ఆటగాళ్ళ మానసిక స్థైర్యం మరింత మెరుగవుతుందని భారత క్రికెట్​ సంఘం భావిస్తోంది.

ఈ రెండు కిలోమీటర్ల టైమ్​ ట్రయల్​ను ఫాస్ట్​ బౌలర్లు 8 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే బ్యాట్స్​మెన్​, వికెట్​ కీపర్స్​, స్పిన్నర్స్​ ఈ లక్ష్యాన్ని 8 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది జరిగే టి20 వరల్డ్​ కప్​ కు జట్టు ఎంపికను ఈ ఫిట్​నెస్​ లెవల్​ ఆధారంగానే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.