రోహిత్​ కు గాయం.. బ్యాటింగ్​ కు అనుమానం

By udayam on December 7th / 8:45 am IST

బంగ్లాదేశ్​ తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మ బొటన వేలికి గాయమైంది. ఈ విషయాన్ని బిసిసిఐ ట్వీట్​ చేసింది. సిరాజ్​ బౌలింగ్స్​ లో ఇన్నింగ్స్​ రెండో ఓవర్​ 4వ బంతి స్లిప్​ లో ఉన్న రోహిత్​ చేతికి బలంగా తగిలింది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో రజత్​ పాటిదార్​ ఫీల్డింగ్​ కు వచ్చాడు. తాజా సమాచారం మేరకు రోహిత్​ ను వెంటనే స్కానింగ్​ కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో అతడు సెకండ్​ ఇన్నింగ్స్​ లో బ్యాటింగ్​ కు వచ్చేదీ అనుమానంగా నే ఉంది.

ట్యాగ్స్​