మాజీ క్రికెటర్లకు పెన్షన్లపై బిసిసిఐ దృష్టి

By udayam on September 25th / 6:10 am IST

ఇప్పటికే దేశీయ క్రికెట్​ ప్లేయర్ల మ్యాచ్​ ఫీజుల్ని పెంచిన బిసిసిఐ ఇప్పుడు మాజీ క్రికెటర్ల సంక్షేమంపై దృష్టి సారించింది. త్వరలోనే మాజీ క్రికెటర్లకు బిసిసిఐ సరికొత్త పెన్షన్​ ప్లాన్​ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. 25 ఫస్ట్​ క్లాప్​ మ్యాచ్​లు తక్కువ కాకుండా ఆడిన ప్లేయర్లకు పెన్షన్​ అందించాలని ఎప్పటి నుంచో బిసిసిఐ వద్ద ప్రపోజల్​ ఉంది. ఒక వేళ అలాంటి ప్లేయర్లు మరణించినట్లయితే వారి భార్యలకు, లేదా కుటుంబ సభ్యులకు ఆ పెన్షన్​ మొత్తాన్ని అందించనున్నారు.