జే షా : ఐపిఎల్​ ఫైనల్​ అహ్మదాబాద్​లో

By udayam on May 3rd / 1:44 pm IST

ఐపిఎల్​ 15వ సీజన్​ క్వాలిఫైయర్​ 1, ఎలిమినేటర్​, ఫైనల్​ జరిగే వేదికల్ని బిసిసిఐ సెక్రటరీ జనరల్​ జే షా ప్రకటించారు. మే 24, 25 తేదీల్లో జరగనున్న క్వాలిఫైయర్​ 1, ఎలిమినేటర్​ మ్యాచ్​లను కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​లో నిర్వహించనున్నారు. మే 29న జరగనున్న ఐపిఎల్​ ఫైనల్​ను అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ క్రికెట్​ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో క్వాలిఫైయర్​ 2ను సైతం అహ్మదాబాద్​లోనే నిర్వహించనున్నారు.

ట్యాగ్స్​