పంత్​: క్రికెట్​ ఆడకపోయినా.. ఏడాదికి రూ.21 కోట్ల జీతం!

By udayam on January 9th / 6:29 am IST

యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్‌ దీరూభారు అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్య బందం పంత్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం.. రాబోయే ఆరేడు నెలలు అతడు గాయంతో క్రికెట్‌ కు దూరమైనా అతడికి రాబోయే సాలరీ మాత్రం అందించనుంది. పంత్‌ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ప్లేయర్‌ అన్న విషయం తెలిసిందే. ప్రతీ యేటా అతడికి రూ. 5 కోట్ల వేతనం అందుతుంది. దానితో పాటు ఐపీఎల్‌ లో రిషభ్‌ పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కాంట్రాక్టు కూడా ఉంది. ఇందుకు గాను రూ. 16 కోట్ల వేతనం అందుతుంది.

ట్యాగ్స్​