ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విజయ్, పూజా హెగ్డేల మూవీ బీస్ట్ ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 11 నుంచి ఈ మూవీ సన్ నెక్స్ట్, నెట్ఫ్లిక్స్ ఓటిటిల్లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. గత నెల 13న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు మొదటి షో నుంచే నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత రోజునే కెజిఎఫ్ చాప్టర్2 విడుదల కావడంతో దీని కష్టాలు మరింత పెరిగాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి రూ.240 కోట్ల వసూళ్ళు సాధించింది.