తమిళనాడు బిర్యానీ ఫెస్ట్​లో బీఫ్​ బ్యాన్​

By udayam on May 13th / 6:39 am IST

తమిళనాడులో ప్రతీ ఏటా జరిగే బిర్యానీ ఫెస్టివల్​లో ఈసారి బీఫ్​ ను మెనూ కార్డ్​ నుంచి తొలగించారు. అయితే దీనిపై స్థానిక ముస్లిం నేతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అంబూర్​ టూరిజం ప్రమోషన్​లో భాగంగా నేటి నుంచి 15వ తేదీ వరకూ జరిగే ఈ బిర్యానీ ఫెస్టివల్​ను అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా అనంతరం ముస్లిం సంఘాల నేతలు ఆ జిల్లా అధికారుల వద్ద బీఫ్​ను తిరిగి మెనూలో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్​