ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతున్న ఖతార్ లోని 8 స్టేడియాల్లో బీర్ల అమ్మకాలపై ఫిఫా నిషేధం విధించింది. దీనిపై ఈ మ్యాచు లు చూడడానికి వచ్చిన వివిధ దేశాల అభిమానులు తమకు బీర్లు కావాలంటూ స్టేడియంలో నినాదాలు చేస్తున్నారు. నిన్న జరిగిన ఖతార్, ఈక్వడార్ ప్రారంభ మ్యాచ్‌లో వి వాంట్ బీర్ నినాదాలు స్టేడియాన్ని హౌరెత్తించాయి. దాంతో, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్‌ఫాంటో దోహాలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. ‘ ఒక రోజులో మూడు గంటలు బీరు తాగకున్నా మీరు బతుకుతారని నేను అనుకుంటున్నాను ‘ అంటూ విమర్శకులకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు.