రూ.90 వేల బైక్​ కొన్న బిచ్చగాడు

By udayam on May 24th / 10:35 am IST

బిక్ష మెత్తుకుటూ జీవనం సాగిస్తున్న మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి తన భార్య అడిగిందని రూ.90 వేలు పెట్టి బైక్​ కొన్నాడు. సంతోష్​ కుమార్​ జైన్​ అనే ఈ వ్యక్తి తన భార్య మున్నీకి నడుస్తుంటే బ్యాక్​ పెయిన్​ వస్తోందని చెప్పడంతో ఈ భారీ మొత్తం వెచ్చించి బైక్​ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్​లైన్​లో వైరల్​ అవుతోంది. ‘బైక్​ ఉంటే తాను ఈ రాష్ట్రంలోని సియోని, ఇటార్సి, భోపాల్​, ఇండోర్​ ల లోనూ సంపాదించుకోవచ్చు’ అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​