వీడియో: రూ.40 వేల కోట్ల భారీ షిప్పును నిర్మిస్తోన్న సౌదీ

By udayam on November 23rd / 9:52 am IST

వినూత్నమైన, భారీ బడ్జెట్​ నిర్మాణాలకు మారుపేరైన సౌదీ అరేబియా తన ఖాతాలో మరో రికార్డును వేసుకోనుంది. ఏకంగా 5 బిలియన్​ డాలర్లు.. అంటే మన రూపాయల్లో 40 వేల కోట్లతో ఓ భారీ షిప్పును నిర్మించడానికి సిద్ధమవుతోంది. ఏకంగా ఒకేసారి 60 వేల మంది అతిథులకు ఆతిధ్యం ఇవ్వగల ఈ పడవ లాంటి మహా నగరం నీటిపై తేలుతూ ప్రపంచయానం చేసేయగలదు. అయితే ఈ భారీ షిప్పు పట్టే ఓడరేవు మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు. దీంతో ఇది కేవలం సముద్రం మధ్యలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 3డి మోడల్​ వీడియో మీరూ ఓ సారి చూసేయండి!

ట్యాగ్స్​