బెలారస్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో నిరంకుశ పాలనను వ్యతిరేకించినందుకుగాను ఒలింపిక్ స్విమ్మర్ అలియాక్సాండ్రా హెరాసిమెనియాకు సోమవారం బెలారసియన్ కోర్టు 12 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు, తన అపార్ట్‌మెంట్, కారు, బ్యాంకు ఖాతాలోని 48 వేల డాలర్లను కోర్టు స్వాధీనం చేసుకుంది. ఒలింపిక్ విజేత, రాజకీయ కార్యకర్త అయిన ఆమెతోపాటు మరో అథ్లెటిక్ అలెగ్జాండర్ ఒపెకిన్‌లు ఇద్దరూ జాతీయ భద్రతకు హాని కలిగించే చర్యలకు పాల్పడినట్లు ప్రభుత్వం తెలిపింది.