‘బిలీవ్‌’ – ‘సౌత్‌ బే’ ఒప్పందం

టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికే: రానా

By udayam on January 13th / 8:25 am IST

హైదరాబాద్ :భల్లాల దేవుడు దగ్గుబాటి రానా ఇటీవల ‘సౌత్‌ బే’ పేరుతో రానా ఓ యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించి, దీని ‌ ద్వారా సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో పాటు వర్తమాన విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నాడు.

అయితే తాజాగా వరల్డ్‌ లీడింగ్‌ డిజిటల్‌ మ్యూజిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ‘బిలీవ్‌’ – ‘సౌత్‌ బే’  మధ్య  ఒప్పందం కుదిరింది.

ఈసందర్బంగా రానా స్పందిస్తూ  ‘సౌత్‌ బే’కు ఎక్స్‌క్లూజివ్‌ డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వామిగా ఉండేందుకు ‘బిలీవ్‌ ఇండియా’ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.

ఈ ఒప్పందం వల్ల సౌత్‌ బే మరింతగా వ్యూయర్స్‌కు రీచ్‌ అవుతుందని ఆశిస్తున్నామని,  ప్రతిభ గల కొత్త కళాకారులకు అవకాశాలు ఇవ్వడం, కమర్షియల్‌ కంటెంట్‌ తయారు చేయడం వంటి వాటిపై దృష్టి సారిస్తామని చెప్పాడు.

‘బిలీవ్‌ ఇండియా’ డైరెక్టర్‌ కెజీవీ కిరణ్‌ కుమార్ స్పందిస్తూ  ‘‘ప్రతిభ ఉన్న కొత్త కళాకారులను, మ్యూజిక్‌ లేబుల్స్‌ను ప్రోత్సహించడం బిలీవ్‌ ఇండియా కార్యాచరణలో కీలకమైందని పేర్కొన్నారు.

సౌత్‌ బేతో ఎక్స్‌క్లూజివ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఒప్పందం చేసుకోవడం కూడా ఇందులో భాగమేనని, దీనివలన  సంగీత ప్రపంచంలో కొత్త దారిని ఏర్పర్చగలమని నమ్ముతున్నామని వెల్లడించారు.