ఆ ఎంపి ఇంటి ముందు మళ్ళీ పేలిన బాంబు

By udayam on September 14th / 12:08 pm IST

బెంగాల్​ బిజెపి ఎంపి అర్జున్​ సింగ్​ ఇంటి ముందు ఈరోజు మళ్ళీ బాంబు దాడులు జరిగాయి. గత వారంలో సైతం ఆయన ఇంటిపై కొందరు దుండుగులు బాంబులు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు జరిగిన దాడి అనంతరం ఎంపి మాట్లాడుతూ టిఎంసి ప్రభుత్వం తనను చంపడానికి చూస్తోందని ఆరోపించారు. బారక్​పోర్​ ప్రాంతానికి ఎంపిగా ఉన్న ఆయన ఉత్తర 24 పరగణాలలో నివాసం ఉంటున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటల సమయంలో ఆయన ఇంటి వద్ద కొందరు దుండగులు బాంబులు విసిరి పారిపోయారు.

ట్యాగ్స్​