కోల్కతా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ కోర్టు సమన్లు జారీ చేసింది.
కేంద్ర హోంశాఖ మంత్రిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసుకి సంబంధించి బెంగాల్ కోర్టు హోంమంత్రి అమిత్ షాకు సమన్లు జారీ చేసింది.
కోల్కతాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
దీంతో అతడు కోర్టులో దావా వేయడంతో ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటలకు వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరు కావాలని అమిత్ షాకు కోర్టు సూచించింది.