బెంగాల్ విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారి తన కూతురుతో సహా పరారీలో ఉన్నారు. హయ్యర్ సెకండరీ టీచర్ల నియామకంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డట్లు సిబిఐ హైకోర్టుకు చెప్పి.. ఆయనను విచారించేందుకు కోర్టు అనుమతి పొందింది. ఈ సమన్లను ఇవ్వడానికి సిబిఐ అధికారులు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. నిజాం ప్యాలెస్ వద్ద రాత్రి 8 గంటల వరకూ వేచి చూసినా ఆయన రాలేదు. బుర్ద్వాన్ స్టేషన్ నుంచి ఆయన పదతిక్ ఎక్స్ప్రెస్లో పారిపోయినట్లు సిబిఐ గుర్తించింది.