గతంలో రెండు సార్లు క్యాన్సర్ నుంచి బయటపడ్డ బెంగాలీ నటి అయింద్రిలా శర్మ కు బుధవారం రెండు సార్లు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెకు వైద్యులు సిపిఆర్ చేస్తున్నారు. నవంబర్ 1న బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్నారు. పరిస్థితి కాస్త కుదుటపడిందని వైద్యులు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.