ప్రముఖ నటి ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​ లభ్యం

By udayam on May 26th / 7:18 am IST

బెంగాల్​ నటి బిడిషా డె మజుందర్​ సూసైడ్​ నోట్​ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 21 ఏళ్ళ బిడిషా కోల్​కతాలోని డుమ్​ డుమ్​ ప్రాంతంలోని ఓ అపార్ట్​మెంట్​లో ఫ్లాట్​ అద్దెకు తీసుకుని గత 4 నెలలుగా అక్కడే ఉంటున్నారు. అనుభబ్​ బేరా అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తున్న నటి.. అది బ్రేకప్​ కావడంతో డిప్రెషన్​లో ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని ఆమె స్నేహితులు పోలీసులకు వివరించారు. ఈ కేసు విచారణ జరుగుతోందని.. సూసైడ్​ నోట్​లో మరిన్ని విషయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​