పాపులర్ టీవీ నటి పల్లవి డే (21) తన ప్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బెంగాల్లో తన నటనతో, అందంతో క్రేజ్ తెచ్చుకున్న ఈమె అదే ప్లాట్‌లో తన స్నేహితుడు షాగ్నిక్ చక్రబర్తితో కలిసి ఉంటోంది. షాగ్నిక్ బయటకు వెళ్ళిన సమయంలో ఆమె ఇలా ఉరేసుకుందని పోలీసులు తెలిపారు. బెంగాల్లో తెరకెక్కిన సిరాజేర్ బేగం, మోన్మనేనా, రేష్మా జాపి, కుంజో ఛాయా, సరస్వతి ప్రేమ్ వంటి సీరియల్స్‌తో ఆమె పేరు తెచ్చుకుంది.