డ్రోన్ల ద్వారా మందులు, నిత్యావసరాలు

By udayam on May 3rd / 11:19 am IST

దేశ టెక్​ రాజధాని బెంగళూరులో డ్రోన్ల ద్వారా మెడిసిన్​, నిత్యావసరాల్ని పంపించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పాటు డ్రోన్ల ద్వారానే సిటీ మొత్తాన్ని శానిటైజ్​ చేయాలని సైతం ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. ‘ఈ కష్ట సమయంలో మందులు, నిత్యావసరాలు సరైన సమయానికి అందించడం అత్యంత క్లిష్టమైన పని. దానిని మేం దేశంలోనే తొలిసారిగా డ్రోన్లు ఉపయోగించి చేయనున్నాం. దాంతో పాటు సిటీ మొత్తాన్ని డ్రోన్ల ద్వారా శానిటైజ్​ చేస్తాం’ అని సిఎం యడియూరప్ప వెల్లడించారు.

ట్యాగ్స్​