కాన్ఫిడిరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) ఆధ్వర్యంలో జిఎస్టీ నియమ నిబంధనల్ని సడలించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న (శుక్రవారం) భారత్ బంద్ నిర్వహించనున్నట్లు వర్తక సంఘ ప్రతినిధులు వెల్లడించారు.
ఆరోజు దేశవ్యాప్తంగా 1500 ప్రాంతాలలో ధర్నాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిఎస్టీలో ఉన్న కఠినమైన నిబంధనల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సిఎఐటి ఈ ధర్నా చేస్తోంది.
జిఎస్టీ లో ఉన్న స్లాబ్ రేట్లను సరళతరం చేయాలని సైతం వర్తక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.