బూస్టర్​ డోస్​ రేట్​ ఫిక్స్​ చేసిన భారత్​ బయోటెక్​

By udayam on December 27th / 9:52 am IST

కొవిడ్​ వ్యాప్తి విజృంభిస్తుందన్న వార్తల నేపధ్యంలో ప్రజలు మూడో డోస్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ముక్కుతో తీసుకునే కొవిడ్​ చుక్కల మందును తయారు చేసిన భారత్​ బయోటెక్​ దాని ఖరీదును నిర్ణయించింది. ఇంట్రానాజల్​ వ్యాక్సిన్​ గా పిలిచే ఈ ‘ఇంకోవాక్​’ ఒక డోసు ఖరీదు ప్రైవేటు ఆసుపత్రులకు రూ.800లు గానూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.325 గానూ నిర్ణయించింది. జనవరి నాలుగో వారం నుంచి ఈ వ్యాక్సిన్​ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.

ట్యాగ్స్​