రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ్టితో 100 రోజులు పూర్తి చేసుకుంది.సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర ఈ వంద రోజుల్లో రాహుల్లో 8 రాష్ట్రాలను కవర్ చేస్తూ.. 2800 కి.మీ.ల పాదయాత్ర చేశారు. మరో నాలుగు రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర కొనసాగనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లలో యాత్రలను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం రాజస్థాన్ లో నడుస్తున్నారు. ఆపై ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హరియాణా, పంజాబ్ లలోనూ యాత్ర చేయనున్నారు.