రిపబ్లిక్​ డే పరేడ్​లో మహిళా పైలట్​

తొలిసారిగా ఛాన్స్​ దక్కించుకున్న భావనా కాంత్​

By udayam on January 19th / 7:09 am IST

జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో రాజ్​పథ్​ వద్ద జరిగే భారత గణతంత వేడుకల్లో నిర్వహించే వైమానిక విన్యాసాల్లో ఈసారి మహిళా శక్తి వికసించనుంది.

ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​లో తొలి యుద్ధ విమాన పైలట్​గా ఖ్యాతిగాంచిన ఫ్లైట్​ లెఫ్ట్​నెంట్​ భావనా కాంత్​ ఈసారి పరేడ్​ సందర్భంగా యుద్ధ విమాన విన్యాసాల్లో పాల్గొననున్నారు.

ఈ పరేడ్​లో జరిగే యుద్ధ విమాన విన్యాసాల్లో ఇప్పటికి వరకు పురుషులు మాత్రమే పాల్గొంటుండగా తొలిసారిగా భావనా కాంత్​ ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు.

ప్రస్తుతం రాజస్థాన్​ ఎయిర్​బేస్​లో విధులు నిర్వహిస్తున్న ఆమె అక్కడ మిగ్​ – 21 బిసాన్​ యుద్ధ విమానాన్ని నడుపుతున్నారు.

2016లో ఈమెతో పాటు అవని చతుర్వేది, మోహనా సింగ్​లో తొలి యుద్ధ విమాన పైలట్​లుగా ఛార్జ్​ తీసుకున్నారు.