బీహార్​: బర్త్​ డే పార్టీలో ఆడలేదని కాల్పులు

By udayam on November 17th / 6:03 am IST

బర్త్​ డే పార్టీలో కొంచెం ఎక్కువ సేపు పెర్ఫార్మెన్స్​ చేయడానికి నిరాకరించిందనే కారణంతో ఓ బోజ్​ పూరీ సింగర్లు ముఖేష్​ యాదవ్​, నీలు బెహ్రాల పై బీహార్​ లో కాల్పులు జరిపారు. ఈ ప్రోగ్రామ్​ కోసం వచ్చిన ఈ సింగర్లు అక్కడకు వచ్చిన వారంతా తాగి.. తూలుతుండడంతో పెర్ఫార్మెన్స్​ చేయడానికి నిరాకరించి బయటకు వచ్చేశారు. దీంతో వారిని బైకులపై వెంబడించిన ప్రోగ్రామ్​ కు వచ్చిన ముగ్గురు.. వారిపై పలురౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో సింగర్లు ప్రస్తుతం అర్రే లోని సర్దార్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్​