పండ్ల వ్యాపారిపై మహిళ దౌర్జన్యం

By udayam on January 12th / 9:46 am IST

తోపుడు బండిపై పండ్లు అమ్ముకునే వ్యక్తి పట్ల భోపాల్​ కు చెందిన ఓ మహిళ ప్రవర్తించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె వెళ్తున్న కారుకు అడ్డంగా వచ్చి, తన కారుకు డ్యామేజ్​ చేశాడన్న కోపంతో ఊగిపోయిన ఆ మహిళ బండి మీద ఉన్న బొప్పాయి పండ్లను రోడ్డు మీద పారేసింది. అప్పటికీ కోపం తగ్గకపోవడంతో ఆ బండి మొత్తాన్ని పక్కనే ఉన్న కాల్వలోకి తోసేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ కావడంతో భోపాల్​ కలెక్టర్​ స్పందించి ఆమెను అరెస్ట్​ చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్​