కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోస్​ తీసుకున్న బైడెన్​

By udayam on January 12th / 9:30 am IST

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్​ కరోనా వైరస్​కు సంబంధించిన రెండో డోస్​ను ఈరోజు తీసుకున్నారు.

ఆయన ఇప్పటికే మొదటి డోస్​ తీసుకుని మూడు వారాలు గడిచిన సందర్భంగా రెండో డోస్​ను ఆయన వ్యక్తిగత డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకున్నారు.

అమెరికాలోని ప్రజలకు పిఫైజర్​ వ్యాక్సినేషన్​ మొదలుపెట్టి నెల రోజులు సమీపిస్తున్నా ఇప్పటికీ చాలా మందికి ఈ వ్యాక్సిన్​ అందలేదు. దీనిపై ఇప్పటికే చాలా చోట్ల విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

ఈనెల 20న జరిగే కార్యక్రమంలో జో బైడెన్​ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే.