అమెరికాలో 10 లక్షలు దాటిన కొవిడ్​ మృతులు

By udayam on May 13th / 5:16 am IST

అగ్రరాజ్యం అమెరికాలో గురువారం రాత్రి నాటికి కొవిడ్​తో మరణించిన వారి మొత్తం సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ ప్రకటించారు. లక్షల కుటుంబాల్లో విషాదం నింపిన ఈ మహమ్మారికి కారణమైన వారి విషయంలో నిస్సత్తువుగా ఉండకూడదని ఆయన పిలుపునిచ్చారు. వీలైనన్ని ప్రాణాలను రక్షించేందుకు సాధ్యమైనంత కృషి జరపాలని పేర్కొన్నారు. అయితే అమెరికా, ఆఫ్రికా దేశాలలో తప్ప ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ ఉధృతి క్రమంగా తగ్గుతోందని డబ్ల్యుహెచ్​ఓ ప్రకటించింది.

ట్యాగ్స్​