వైట్‌హౌస్ తదుపరి ప్రెస్ సెక్రటరీగా నల్లజాతీయురాలైన కరీన్ జీన్ పియర్‌ను ప్రెసిడెంట్ జో బైడెన్ నియమించారు. ఎల్జిబిటిక్యూ+ సభ్యురాలైన కరీన్ గతంలో బరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ల తరపున ఎన్నికల ప్రచార కర్తగా కీలక బాధ్యతలు నిర్వహించారు. దీంతో ఆమెను అత్యున్నత స్థాయి పదవికి బైడెన్ ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న జెన్ పాకి పదవీకాలం ఈనెల 13తో ముగియనుంది.