బైడెన్​: తైవాన్​పై దాడి చేస్తే మేం జోక్యం చేసుకుంటాం

By udayam on May 23rd / 11:44 am IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తైవాన్​కు గట్టి మద్దతు పలికారు. చైనా తైవాన్​ను ఆక్రమించుకోవాలని చూస్తే తాము రంగంలోకి దిగుతామని డ్రాగన్​ దేశానికి గట్టి హెచ్చరికలు పంపారు. ‘తైవాన్​కు మేం ఉన్నామని హామీ ఇస్తున్నా.. వన్​ చైనా విధానానికి మేం ఎలా కట్టుబడి ఉన్నామో.. తైవాన్​పై బల ప్రయోగం చేస్తే ఆ దేశానికి మద్దతు ఇస్తామన్న దానికీ కట్టుబడే ఉన్నాం. బలవంతంగా తైవాన్​ను చైనా దక్కించుకోలేదు. చైనా అలా చేస్తే ఈ ప్రాంతం మరో ఉక్రెయిన్​ అవుతుంది’ అని చెప్పారు.

ట్యాగ్స్​