భారత్​లో మీ చుట్టాల చిట్టా తెచ్చా.. : బైడెన్​తో మోదీ

By udayam on September 25th / 4:59 am IST

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​తో సమావేశం అయ్యారు. వాతావరణ మార్పులు, కొవిడ్​తో పాటు ఇండో–పసిఫిక్​ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే వీరి సమావేశంలో భారత్​లోని బైడెన్​ ఇంటిపేరుతో ఉన్న వారి గురించీ చర్చ జరగడం విశేషం. ‘నిజంగా మా చుట్టాలు భారత్​లో ఉన్నారా?’ అని బైడెన్​ ప్రశ్నిస్తే ‘అవును. అది నిజమే. మా దగ్గర పేపర్లు కూడా ఉన్నాయి. మీకు ఏ వరస అవుతారో మీరు తేల్చుకోవాలి మరి’ అని మోదీ సమాధానం ఇచ్చారు.

 

ట్యాగ్స్​