బీహార్‌లో కూలిన ఓ బ్రిడ్జిపై తనకు ఓ ఐఎఎస్ అధికారి ఇచ్చిన సమాధానం విని షాక్ అయ్యానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బీహార్ ఐఎఎస్ అధికారులు సుల్తాన్‌గంజ్ బ్రిడ్జి ప్రమాదానికి బలమైన గాలులే కారణమని చెప్పడం తనను విస్మయానికి గురి చేసిందన్నారు. ఏప్రిల్ 29న కూలిన ఈ బ్రిడ్జి నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై మాట్లాడిన ఆయన.. అదికారుల తీరుపై మండిపడ్డారు. 3.116 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి కూలడంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.