4:01 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

బీహార్ మంత్రి కరోనాతో కన్నుమూత 2 weeks ago

పట్నా: బీహార్ రాష్ట్ర జనతాదళ్  సీనియర్ నాయకుడు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ దియో కామత్ శుక్రవారం కన్నుమూశారు. 69 ఏళ్ల వయసు గల మంత్రి కపిల్ దియోకు ఇటీవల కరోనా సోకడంతో ఆయన చికిత్స కోసం పట్నాలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో చేరారు.

అయితే మంత్రి కామత్ కిడ్నీ వ్యాధితో కూడా బాధపడుతున్నారు. వెంటిలేటరుపై ఉన్న కామత్ అర్దరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కామత్ వంటి మంచి నాయకుడిని కోల్పోయామని బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ రాజకీయవేత్త, పరిపాలనా దక్షుడిని కోల్పోయానని సీఎం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.