తులసీదాస్ రాసిన ‘రామ్చరిత్మానస్’ పుస్తకం మీద బిహార్ విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ‘మనుస్మృతి మాదిరిగానే రామ్చరిత్మానస్ కూడా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టింది’ అని బిహార్ విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ చంద్రశేఖర్ అన్నారు. ‘మనుస్మృతి, రామ్చరిత్మానస్, ఎంఎస్ గోవాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ వంటి పుస్తకాలు సమాజాన్ని విభజించాయి. విద్వేషాలు రెచ్చగొట్టాయి. ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది కాబట్టే మనుస్మృతిని కాల్చారు. నలంద యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.