పెద్దల తీర్పు: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఐదు గుంజీళ్ళే శిక్షా?

By udayam on November 25th / 11:04 am IST

బీహార్​ లోని నవాడా జిల్లాలో ఐదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ నిందితుడికి గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడికి కేవలం 5 గుంజీలు మాత్రమే శిక్షగా విధించారు. ఆ చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి నిందితుడు పౌల్ట్రీ ఫామ్​ లోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డట్లు తేలింది. దీనిపై పంచాయితీ జరిపించిన చిన్నారి తల్లిదండ్రులు.. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్​ చేశారు. అయితే గ్రామపెద్దలు మాత్రం కేవలం 5 గుంజీలు మాత్రమే శిక్షగా విధించిన వీడియో నెట్టింట వైరల్​ గా మారింది.

ట్యాగ్స్​