పట్టాలు తప్పిన రైలు.. 9 మంది మృతి

By udayam on January 14th / 5:20 am IST

బికనేర్​–గువాహతి ల మధ్య తిరిగే బికనీర్​ ఎక్స్​ప్రెస్​ నిన్న పట్టాలు తప్పింది. మొత్తం 12 భోగీలు పట్టాలు తప్పగా 9 మంది మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది. రాజస్థాన్​లోని బికనేర్​ నుంచి మొదలైన ఈ ట్రైన్​ అస్సాంలోని గువాహతికి బీహార్​లోని పాట్నా మీదుగా వెళ్తుండగా ఈ జల్​పైగురి వద్ద గురువారం సాయంత్రం 5.15 గంటలకు పట్టాలు తప్పింది. ఆ సమయంలో ట్రైన్​లో 1200 మంది ప్రయాణిస్తున్నారు. మృతులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

ట్యాగ్స్​