బండికి పాడెకట్టారు..

By udayam on August 30th / 5:18 am IST

అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. దీనిలో భాగంగా ఒంగోలు టిడిపి నేత దామచర్ల జనార్ధన్​ ఓ బండిని పాడెపై కట్టి దానికి దహన సంస్కారాలు తీసుకెళ్తున్నట్లు ప్రకటించారు. పెట్రోల్​ రేట్లను భరించలేక ఈ బండి ఆత్మహత్య చేసుకుందని పేర్కొంటూ ఈ వినూత్న నిరసన చేపట్టారు. దీంతో ఈ నిరసన ప్రదర్శన ఫొటోలు వైరల్​గా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్​ ధర రూ.110కు చేరువవుతోంది.

ట్యాగ్స్​