జైలు నుంచి విడుదలైన ‘బికినీ’ కిల్లర్​

By udayam on December 23rd / 11:45 am IST

కరడుగట్టిన నేరస్తుడు, బికిని సీరియల్ కిల్లర్ గా పేరుగాంచిన చార్లెస్ శోభరాజ్ (78) నేపాల్ లోని ఖాట్మండు జైలు నుంచి నేడు విడుదలయ్యాడు. అమెరికన్ టూరిస్టు కోనీ జో బ్రాంజిచ్, అతడి కెనడా ఫ్రెండ్ లారెంట్ కారియర్ లను హత్య చేసిన కేసులో చార్లెస్ శోభరాజ్ కు నేపాల్ కోర్టు జీవితఖైదు విధించగా, క్షీణించిన ఆరోగ్యం, మెరుగైన ప్రవర్తన కారణంగా అతడిని విడుదల చేయాలని నేపాల్​ సుప్రీంకోర్ట్​ ఇటీవల ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన తర్వాత అతడిని దేశం దాటించేయాలని కూడా కోర్ట/ పేర్కొంది. పాశ్చాత్య టూరిస్టులకు డ్రగ్స్​ ఇచ్చి మత్తులోకి జారుకున్నాక వారిని దోచుకుని 20 మందికి పైగా హత్యలు చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.

ట్యాగ్స్​