భుట్టో: జమ్మూలో ముస్లింలను మైనారిటీలుగా మార్చుతారా?

By udayam on May 13th / 10:13 am IST

కశ్మీర్​ లోయలో ముస్లింలను మైనారిటీలుగా మార్చేందుకు భారత్​ ప్రయత్నిస్తోందని పాకిస్థాన్​ కొత్త విదేశాంగ మంత్రి బిలావల్​ భుట్టో జర్దారీ ఆరోపించారు. మంత్రిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా ఆ దేశ పార్లమెంట్​ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన భారత్​పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్​ లోయలోని ముస్లిం సమాజంపై భారత ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని విమర్శించారు. ఆర్టికల్​ 370 ని బారత్​ అన్యాయంగా అడ్డుకుందన్న భుట్టో.. జనాభా నిష్పత్తిని మార్చాలని చూస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్​