మైక్రోసాఫ్ట్ అధినేత, బిలియనీర్ బిల్‌గేట్స్ తాను కొవిడ్ పాజిటివ్ బారిన పడినట్లు స్వయంగా పేర్కొన్నాడు. కొవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని అందులో పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశాడు. వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్లోకి వెళ్ళారు. కొవిడ్ వంటి వైరస్లు మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన 2015లోనే తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆయన చెప్పినట్లే 2019లో ఈ మహమ్మారి విరుచుకుపడింది.