ట్విట్టర్‌ను టెక్ బిలయనీర్ ఎలన్ మస్క్ కొనుగోలు చేయడంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ స్పందించాడు. మస్క్ ఈ సంస్థను మరింత దిగజార్చుతాడని పేర్కొన్నారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన గేట్స్.. ‘ఇంత పెద్ద మొత్తం పెట్టి ఆ సంస్థను కొనుగోలు చేయడం వెనుక అతడి ఆలోచన తెలియట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆ సంస్థను మస్క్.. మరింత కిందకు దిగజార్చుతాడు’ అని బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు.