ఈ వీకెండ్‌తో ముగియనున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా నటి బిందు మాధవి నిలిచిందని సోషల్ మీడియాలో లీక్‌లు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మొదలైన ఈ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అయింది. అయితే గ్రాండ్ ఫినాలే వీక్‌లో ఏకంగా ఏడుగురు ఫైనల్ రౌండ్‌కు అడుగుపెట్టారు. వీరిలో బిందు, అఖిల్, బాబా భాస్కర్, మిత్ర, శివ, అరియానాలు ఉన్నారు. అఖిల్‌ను వెనక్కి నెట్టి బిందు టైటిల్‌ను ఎగరేసుకుపోయిందని తెలుస్తోంది.