జైపూర్: ఓ పక్క కరోనా ఎఫెక్ట్ తో సతమవుతుంటే, మరోపక్క దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్ద్ ఫ్లూ వణికిస్తోంది. ఇక రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలలో మరో 371 పక్షులు మృతి చెందాయి.
రాష్ట్రంలోని 15 జిల్లాలను బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 371 పక్షులు మృతి చెందాయని, దీనితో రాష్ట్రంలో మొత్తంగా మృతి చెందిన పక్షుల సంఖ్య 3,321కి చేరిందన్నారు.
కాగా జైపూర్ జంతు ప్రదర్శనశాలలో మూడు బాతులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. ఇదేవిధంగా సీకర్, భీల్వాడా, చూరూ నుంచి సేకరించిన పక్షుల నమూనాలో నాలుగు నమూనాలు నెగిటివ్ వచ్చాయన్నారు.
రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 235 నమూనాలను పరీక్షలకు పంపామన్నారు.
మరోవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పౌల్ట్రీ మార్కెట్‌పై పడింది. వాస్తవంగా చూస్తే, శీతాకాలం లో చికెన్, గుడ్లు అధికసంఖ్యలో విక్రయమవుతుంటాయి.
అయితే ఈసారి బర్డ్ ఫ్లూ కోళ్ల వ్యాపారాన్ని దారుణంగా దెబ్బకొట్టింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు తేలడంతో నేపధ్యంలో చికెన్, గుడ్ల ధరలు అమాంతం పడిపోయాయి.
కొన్ని రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ. 60 రూపాయలకు దిగువగా పడిపోయింది. గుడ్ల ధరలు చూస్తే, తమిళనాడులోని నమక్కల్‌లో ఒక గుడ్డు ధర రూ.5.10 నుంచి 4.20కి దిగజారింది.
హరియాణాలోని బర్వాలాలో ఒక గుడ్డు ధర రూ. 5.35నుంచి రూ. 4.05 పైసలకు, పూణెలో ఒక గుడ్డు ధర రూ. 4.50 పైసలుగా తగ్గింది.