ప్రభుత్వమే మతమార్పిడిలు చేస్తోంది : నడ్డా

By udayam on April 13th / 8:45 am IST

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్​ ప్రభుత్వంలోని పెద్దలే రాష్ట్రంలో మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న నడ్డా, ఇక్కడి ప్రభుత్వం అలాంటి వారికి సహాయం చేస్తోందని, నెలవారీ జీతాలు సైతం ఇస్తోందని తెలిసి ఆశ్చర్యం వేసిందన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేస్తున్న వారికి సైతం ఎలాంటి శిక్షలు పడకుండా ఈ ప్రభుత్వమే దోషుల్ని కాపాడుతోందన్నారు. బంధు ప్రీతి, అవినీతితో వైఎస్​ఆర్​సిపి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు.

ట్యాగ్స్​