కేంద్రంలోని మోదీ సర్కార్.. దేశాన్ని 100 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిందని సిఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ 8వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభలో కెసిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనకు ప్రాణత్యాగాలు చేసిన వారిని నివాళులర్పించిన ఆయన జాతీయ జెండాను ఎగురేశారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వం మాత్రం.. కేంద్రాన్ని బలపరుస్తూ.. రాష్ట్రాలను అణగదొక్కుతోందని ధ్వజమెత్తారు.