బిజెపిలోకి జితిన్​ ప్రసాద

By udayam on June 9th / 10:08 am IST

వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అప్పుడే ఆశావహులు పార్టీలు మారడం మొదలైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్​ కీలక నేత జితిన్​ ప్రసాద ఈరోజు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్​ గాంధీకి అత్యంత నమ్మకస్తుడైన 47 ఏళ్ళ ప్రసాద కాంగ్రెస్​లోని గ్రూప్​ 23లో కీలక సభ్యుడు. ‘3 దశాబ్దాలా కాంగ్రెస్​ అనుబంధానికి ఇక సెలవ్​. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏకైక జాతీయ పార్టీ బిజెపి. మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలే. దేశానికి మోదీ లాంటి నాయకుల అవసరం ఉంది’ అని ఆయన ఈరోజు ప్రకటించారు.

ట్యాగ్స్​