గవర్నర్ ని కలిసిన బిజెపి, జనసేన

By udayam on January 28th / 9:41 am IST

అమరావతి: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను బీజేపీ, జనసేన నేతలు గురువారం కలిశారు. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తదితరులు గవర్నర్ ని కల్సి వివిధ అంశాలపై చర్చించారు.

ఈసందర్బంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో నామినేషన్‌ల‌ విధానాన్ని అమలు‌ చేయాలని గవర్నర్‌ని కోరామని తెలిపారు.ఆలయాల‌పై దాడుల విషయంలో దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో నామినేషన్‌లు వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని, అందుకే ఈసారి కూడా అలాంటి పరిస్థితి లేకుండా చూడాలని గవర్నర్‌ని కోరామని చెప్పారు. ఏకగ్రీవాలు సహజమే అయినా, ప్రలోభపెట్టి, భయపెట్టి చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.