గుజరాత్​కు మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యేలు

By udayam on June 21st / 12:49 pm IST

మహారాష్ట్రలో అత్యంత వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలలో భాగంగా బిజెపి తన 106 మంది ఎమ్మెల్యేలను గుజరాత్​లోని అహ్మదాబాద్​కు తరలించింది. శివసేన రెబల్​ ఎమ్మెల్యే ఏక్​నాథ్​ షిండేతో ఇప్పటికే టచ్​లో ఉన్న బిజెపి అగ్రనాయకత్వం తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా అక్కడకు గుజరాత్​కు తరలించేసింది. ఉద్ధవ్​ ఠాక్రే ప్రభుత్వంపై కోపంతో ఉన్న 35 మంది శివసేన ఎమ్మెల్యేలు షిండేతో టచ్​లో ఉన్నారని, వారంతా ఏ క్షణమైనా పార్టీ జంప్​ కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరో వైపు షిండేతో చర్చలు జరపడానికి వెళ్ళిన ఠాక్రే అనుచరుడు మిలింద్​ నరవేకర్​ను షిండే కలవలేదు.

ట్యాగ్స్​