మరోసారి కార్పొరేట్‌ విరాళాల్లో బిజెపికే అధికం

By udayam on December 30th / 10:42 am IST

కార్పొరేట్‌ విరాళాల్లో బిజెపి మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. ఎలక్టోరల్‌ ట్రస్ట్స్‌ ద్వారా బిజెపికి మిగతా అన్ని పార్టీల కంటే 72 శాతం కంటే ఎక్కువ చందాలు వచ్చినట్లు ఎడిఆర్‌ నివేదిక తెలిపింది. భారత రాష్ట్రసమితి, సమాజ్‌ వాది పార్టీ, ఆప్‌, మరియు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లతో పోల్చితే కాంగ్రెస్‌కు తక్కువ విరాళాలు వచ్చాయి. ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ల నుండి బిజెపికి రూ.130 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.18.44 కోట్లు, టిఆర్‌ఎస్‌కు రూ. 40 కోట్లు, సమాజ్‌వాది పార్టీకి రూ. 27 కోట్లు, ఆప్‌ పార్టీకి రూ.21.12 కోట్లు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు రూ.20 కోట్లు వచ్చాయి.

ట్యాగ్స్​
BJP