ఆదిపురుష్​: రాముడు, రావణుడి క్యారెక్టర్లపై బిజెపి అభ్యంతరం

By udayam on October 4th / 10:32 am IST

రెండు రోజుల క్రితం విడుదలైన ప్రభాస్​ మూవీ ఆదిపురుష్​ లో రాముడు, రావణుడి క్యారెక్టర్ల డిజైన్​ పై దేశవ్యాప్తంగా బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయణాన్ని ఆదిపురుష్​ టీమ్​ క్రియేటివిటీ పేరుతో వక్రమార్గం పట్టించిందని మధ్యప్రదేశ్​ మంత్రి నరోత్తమ్​ మిశ్ర విమర్శించారు. బిజెపి అధికార ప్రతినిధి మాళవిక అవినాష్​ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రావణుడి క్యారెక్టర్​ తుర్కియాను పాలించిన మహ్మద్​ ఖిల్జిని గుర్తు చేస్తోందని దెప్పి పొడిచారు. అంతే కాకుండా తెలుగు సినిమాల్లోని రావణుడి క్యారెక్టర్​లో నటించిన సీనియర్​ నటుడు ఎన్​టి రామారావు గురించి మీకు తెలుసా? అంటూ ఆమె చిత్ర యూనిట్​ను ప్రశ్నించారు.

ట్యాగ్స్​